Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప: స్వాగతం ప్రభో సుస్వాగతం ||2||
భువి జనాళి దీవి జనాళి స్వాగతమనగా
భువి మానవ హృదయాలు పరితపించగా
మా మానస మందిర
మందసమున కాలిడగా llస్వాll
1. నీ పదమే ధర్మమని ఎరిగిన మేము
నీ వాక్కే సత్యమని తెలిసిన మేము
ధర్మపథం సత్య వాక్కు జీవమైన
మార్గమందు మమ్మునడుపగా
మా హృదయాలకు
మరోసారి స్వాగతం llస్వాll
2. రోగులను గుణపరచిన నీ హస్తము
పాపుల మనసుల తెరచిన నీ శాంతము
మృతులకు జీవమునిచ్చిన నీ మహిమ
నీ మహిమలో నీ కరుణలో ఆదరణ
శాంతమును దివ్య కాంతిగా
నీ ప్రజలకు ప్రసరించ
మా హృదిలో నిలపగా llస్వాll