Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పల్లవి
స్వాగతం సుస్వాగతమనుచు
దేవుని పాదపూజకు
స్వాగతం సుమస్వాగత మనుచు
శ్రీక్రీస్తు త్యాగబలికి
ఆత్మ నడిపించు ఆనందముతో
అరుదెంచెదం ఆరాధించెదం ||2|| ||స్వా||
1 వ చరణం..
దేవ దేవుని వరములతో
ఇలలో యాజక అర్చనతో
తండ్రిని కొలిచే మార్గమిదే
సత్యము తెలిపే సమయమిదే ||2||
పవిత్ర దేవుని ప్రజలముగా ప్రభు
దీవెనలను పొందేదము ||2|| ||స్వా||
2 వ చరణం..
శ్రీసభ సంఘారాధనతో
పునీతుల బృంద బందముతో
కరుణను పొందే యాగమిదే
కలుషము బాపే సమయమిదే. ||2||
ఎంపిక పొందిన ప్రజలముగాను
ఎనలేని వరములు పొందెదము ||2|| ||స్వా||