Type Here to Get Search Results !

వచ్చుచున్నాడయ్య మెస్సయాసుడు ( vachchuchunnadayya messayasudu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప: వచ్చుచున్నాడయ మెస్సయాసుడు 

పచ్చిక బయళ్ళలోన మనల మేపను 

భక్త యోహాను ప్రకటించిన మెస్సయాసుడు

యెషయ్య ప్రవక్త మాట నెరవేర్చగను 


1. ప్రభువు దారిని సిద్దపరచండి

ప్రభువు త్రోవను తీర్చిదిద్దండి ||2|| 

ప్రతి లోయను పూడ్చి వేయండి

ప్రతి కొండను చదును చేయండి ||2|| 


2. పరవశించుచు గళము విప్పండి

ప్రభువు మహిమను పొగడి పాడండి ||2|| 

ప్రభువు మెస్సయ్య దీవించునండి

ప్రభువు పూజలో పాలు పొందండి ||2|| 


3. స్నేహ భావమున్ అందుకొనరండి

పరుల ప్రేమను పంచుకొనరండి ||2|| 

అన్నదాన కార్యములను అవలంబించండి .

అన్యాయమురికట్టుచు ధన్యులు కండి ||2|| 


4. వక్రమార్గము చక్కపర్చండి

గరకు మార్గం నునుపు చేయండి ||2|| 

పవిత్రాత్మలో ఇక స్నానమొందరండి 

మారు మనసుతో ఇలలో జీవించండి ||2|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section