Type Here to Get Search Results !

వందనమయ్యా అంతోనివారా ( vandanamaiah anthonivara Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


వందనమయ్యా అంతోనివారా 

వందనమయ్యా ఓదార్చువారా ||2||

వందనం వందనం వందనం ||2|| ||వంద|| 


1. అడిగినదే తడవుగా - ఇచ్చువారు మీరని

అద్భుతాలు చేయగా 

మహిమలెన్నో గలవారనీ 

పరితాప హృదయులను ఊరడించువారని 

పాపాత్ముల మనసును మార్చువారు మీరని 

నిన్ను వేడగా నీ దరికి చేరగా 

మాకు తోడుగా మా చెంత నుండుమా 

అభయమిచ్చి శుభము కూర్చి

ఆదరించుమయ్యా ||వంద|| 


2. నీ బోధల నాలకింప కడలి చేపలొచ్చెనని

నీ ప్రార్థన నాదరింప-బాలయేసు వచ్చునని 

దివ్యసత్రసాదమున ప్రభుసన్నిధి నెరిగింప 

గాడిదనే మోకరింప చేసిన

మహా ఘనుడవని 

||నిన్ను వేడగా|| ||వంద|| 


3. నిన్ను పొగడినంతనే బాధలు ఎడబాయునని

నిన్ను వేడినంతనే కోర్కెలన్ని తీరునని 

నిన్ను అడిగినంతనే ఆదరించువారని 

నిన్ను కోరినంతనే కనికరించువారని

||నిన్ను వేడగా|| ||వంద|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section