Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
వినయశీలి ఓ జోజప్పగారా - నీతి కిరణమై వెలుగొందినవారా
వందనం జోజప్పగారా మీకే మా వందనము
1. దేవుని చిత్తమునకు లోబడినవాడవు -
మరియమ్మను ప్రేమతో స్వీకరించినవాడవు
దేవుని ఆజ్ఞను పాటించి ధన్యుడవైనావు -
వందనం జోజప్పగారా మీకే మా వందనము
2. కార్మిక జీవులందరికి పాలక పునీతడయ్యావు
మా శ్రమలలో బాధలలో తోడుగ నీడగ ఉంటావు
నిత్యము... అను నిత్యము మా కొరకు వేడుమయ్యా
వందనం జోజప్పగారా మీకే మా వందనము