Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
వెదకని చోటే లేదు- నా దేవుని కోసం
వెళ్ళని స్థలమే లేదు- నా ప్రభుని ప్రేమ కోసం
వెదకితిని వేసారి తిని- అంతటా తిరిగి తిని
తను కానరాక నే కలత చెందితి-
వేదనతో రోదన తో- కన్నీరు కార్చితి
నా లోకి తొంగి చూస్తే- నా గుండెలోనే ఉన్నాడు ll2ll
ప్రేమే దేవుని స్వభావము- ప్రేమే దైవము ll2ll llవెదకనిll
1 వ చరణం..
కొండలను కొండ కోనల నడిగా- నా ప్రభువెక్కడనీ
సంద్రమును జలరాశులనడిగా-నా ప్రభువెక్కడనీ
అడవులనడిగా... అన్ని జీవులనడిగా...
కులికే లేదు పలుకే లేదు జవాబే లేదు llనాలోకిll
2 వ చరణం..
రివ్వున ఎగిరే గువ్వలనడిగా- దేవుడు ఎక్కడ నీ
సుమధుర గానాల కోయిల నడిగా- నా ప్రభువెక్కడనీ
జల జల పారే సెలయేటి నడిగా ll2ll
కునికే లేదు పలుకే లేదు జవాబే లేదు llనాలోకిll