Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప: విలువైనదీ జీవితం-వికసించు నా యేసుతో
విన్నారా ఈ యేసు సర్వమున్
వెలుగొందగా ఈ భువిన్||2||
1. ప్రతి పాపిని రక్షింప ఈ దేవుడు ||2||
పరలోకమును వీడి ఏతెంచెను
యేతెంచిన ఆది చాలు ||2||
ఎదలో నమ్ముట మేలు
యోచించి ప్రభు సన్నిధి చేరగరావా ||వి||
2. ఏ బేధము లేదు ఎవరైననూ
యేసుని చేరగ నేడే రక్షణ దినము ||2||
ఎందుకు మరి ఆలస్యం
ఎరుగని జీవిత గమ్యం
యోచించి ప్రభు సన్నిధి చేరగ రావా ||వి||