Lyrics: Fr. Dusi Devaraj
Tune: Fr. D.V. Prasad
Music: Dattatreya
Album: జీవశృతి - 8
ప: వినుడి వినుడి ప్రభువచనం
మంజులమైన శుభవచనం
వినుడి వినుడి ప్రియ వచనం
అద్భుతమైన నవవచనం
హల్లెలూయా, హల్లెలూయా
హల్లెలూయా... హల్లెలూయా.... ||5||
1. నోవాను పిలిచిన ప్రభువచనం
మోషేను నడిపిన స్థిర వచనం
న్యాయాధిపతులను రాజునెల్ల
ప్రవక్తల నడిపిన వచనం
భక్తులను జ్ఞానులను ప్రేరేపించిన ప్రభు వచనం ||హల్లెలూయా||
2. మరియను పిలిచిన శుభవచనం
యోషేపును నడిపిన కృప వచనం
నజరేయుడగు శాంతి ప్రదాతను
ఆత్మను నడిపిన వచనం
పేతురును, పౌలులను
ప్రేరేపించిన నవవచనం
వినుడి వినుడి ప్రభు వచనం ||హల్లెలూయా||