Type Here to Get Search Results !

వినుడి వినుడి సువార్తను ( vinudi vinudi suvartha Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


వినుడి వినుడి సువార్తను 

వీనుల కమ్మని ఈ వార్తను 

కనుడి కనుడి శ్రీ యేసును 

భువిలో చక్కని ఆ మాటను 

అల్లెలూయ..పాడుచూ

ఆనందముతో స్తుతించుచు ||2|| 


1. మీరూ నామాట విన్నారా 

రాతి పునాది ఇంటికి సాక్షులు ||2|| 

జడివానలు కురిసినగాని 

పెనుగాలులు వీచినగాని ||2|| 

అభయం కాపరి యేసయ్యా

దిగులే లేదిక నాకయ్యా ||అ|| 


2 వీరు నాబాట విడిచారా

ఇసుక పునాది యింటికి సాక్షులు ||2|| 

వరదలు వచ్చినా గాని అలలెన్నో తాకిన గాని 

శూన్యం శూన్యం నీ జ్ఞానం

చీకటి పయనం అగాధము ||అ|| ||వి|| 


3. నేనూ నా ప్రేమ కావలెనా

పచ్చని పచ్చిక బీళ్ళకు సాక్షులు ||2|| 

ఎండలు మండిన గాని 

వడగాల్పులు విసిరినగాని 

శాంతి స్వరూపి శాసనము 

శరణం శరణం కలకాలం ||అ|| ||వి|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section