ఆత్మ పరిశుద్దాత్మ మాపైన వేంచేయుమా ||2||
ఆత్మ పరిశుద్దాత్మ మాలో నివసించుమా||2||
వేగమే వేంచేయుమా నీ కార్యము జరిగించుమా ||ఆత్మ||
1. ఆదిలో జలములపై కదలాడిన ఆత్మ
నూతన సృష్టిని రూపించినాత్మ
వేగమే వేంచేయుమా - నీ కార్యము జరిగించుమా ||ఆత్మ||
2. దహించు అగ్నిగా దిగివచ్చినాత్మ
దర్శన భాగ్యం కలిగించినాత్మ
వేగమే వేంచేయుమా నీ కార్యము జరిగించుమా ||ఆత్మ||
3. ఆకాశం తెరిచిన దేవుని ఆత్మ
యేసుపై రూపిక దిగివచ్చినాత్మ
వేగమే వేంచేయుమా నీ కార్యము జరిగించుమా ||ఆత్మ||