పరిశుద్ధ ఆత్మ దిగిరావయ్యా
పరలోక అగ్ని కురిపించయ్యా ||2||
దిగిరావయ్యా మాపై దిగిరావయ్యా ||2||
దిగిరావయ్యా ఇలపై దిగిరావయ్యా ||2|| పరిశుద్ధ
1. యోర్దాను నదిలో యేసుపైన దిగివచ్చిన
పావుర రూపమా మాపై దిగిరావయ్యా ||2||
ఆదిలో జలములపై కదలాడిన ఆత్మమా
మాపైన దిగిరావయ్యా ||2||దిగిరావయ్యా||
2. కార్మెలు కొండపై ఎలియా ప్రార్థింపగా
దిగివచ్చిన అగ్ని రూపమా మాపై దిగిరావయ్యా
మండుచున్న పొదలో నుండి మాట్లాడిన ఆత్మమా
మాపై దిగిరావయ్యా ||2||దిగిరావయ్యా ||