జీవమా యేసయ్యా
ఆత్మతో నింపుమా అభిషేకించుమా ||2||
స్తోత్రము సోత్రము యేసయ్యా ||4||
ఆరాధనా ఆరాధనా ఆరాధనా నీకే ||2||
1. మేడ గది మీద అపోస్తులపై
కుమ్మరించినాత్మ వలె
పరిశుద్దాగ్ని జ్వాల వలె
నీ ప్రేమను కుమ్మరించుము ||2||స్తోత్రము ||
2. అనుదినం నీ దివ్యసేవలో
అభిషేకం దయచేయుమా
నలుదిశల సువార్త ప్రకటింప
నీ ఆత్మను కుమ్మరించుము ||2|| స్తోత్రము ||