Type Here to Get Search Results !

ఆద్యుడా.. అద్వితీయుడా ( adhyuda.. adhvithiyuda ) | Christian Songs Lyrics in Telugu | Telugu Christian Songs Lyrics

ఆద్యుడా... అద్వితీయుడా 

ఘన మహిమా సింహాసనాధీశుడా 

దివి నుండి వచ్చిన దైవ తనయుడ 

మా హృదిమందిరం నీ ఆలయం 

స్వాగతం స్వాగతం బాలయేసువా ||2|| 

మా హృదయ మందిరాన కొలువుండగా సుస్వాగతం

||ఆద్యుడా|| 


1. పుడమి ప్రజకు పరమ తండ్రి ప్రేమ కానుక 

పరమ సుతుడు ధరణిపైన జనియించెగా 

నింగి నేల సంబరాల ఘనమగు వేడుక ||2|| 

కదలి రారే దైవజనమా స్తుతియించగా ||2||

స్వాగతం స్వాగతం బాలయేసువా ||2|| 

మా హృదయ మందిరాన కొలువుండగా సుస్వాగతం

||ఆద్యుడా|| 


2. పేదవారి పీడితులను ఆదరించగా 

పొరుగువారి సేవలోన తరియించగా 

సమత మమత సఖ్యతతో ఆత్మసాక్షిగా ||2|| 

హృదయార్పణ చేయగ రండి దైవజనమా ||2||

స్వాగతం స్వాగతం బాలయేసువా ||2|| 

మా హృదయ మందిరాన కొలువుండగా సుస్వాగతం

||ఆద్యుడా|| 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section