ప: అరుణ కిరణ రాగ రంజితమై
అనురాగ రంజితమై
భువన బోంతరాళ సంగీతమై స్వర పూజితమై
గమప గమప గమప గమప గమప
గమని గమప గమప గమనిరిసా
అరుణ కిరణ రాగ రంజితమై
అనురాగ రంజితమై
భూనభోంతరాల సంగీతమై
స్వర పూజితమై
కరుణామయుని కలువరి బలికై
కదలిరండి కదలిరండి- ఆ....ఆ....ఆ...
1. ఆబేలుని త్యాగరూప బలితో
అహరోను యాజకబలి అర్పణతో ||2||
అబ్రహాము విశ్వాస బలియాదరణతో ||2||
అంజలించెదము స్తుతి గీతములతో
అల్లెలూయా అల్లెలూయా ||2||
2. నీడతానై నిలచి మనతోడు తానై నడిపి
జీవితాన పూలవాన కురిపించి
అందరిలో మనందరిని
కాచిన ప్రభునికి వందనం
కాపాడిన విభునికి వందనం
అల్లేలూయ అల్లేలూయ