సా: సర్వమంగళ దీపమా
సకల జీవ ప్రకాశమా
సుమధుర సుందర-సౌజన్య దైవమా
శాంతి ధామమా - అమృత కలశమా
స్వాగతం - స్వాగతం - శుభస్వాగతం
ప: అరుణ కాంతులతో - ధరణి పుష్పాలతో
మధుర గీతాలతో-ప్రభుని పూజింతుము ||2||
రాగతాళాలతో - దివ్య గానాలతో ||2||
నవ్య భావాలతో-ప్రభుని కీర్తించెదం ||2|| ||అరుణ||
1. ప్రేమమయుడు-దీర్ఘశాంతుడు సత్యసంపూర్ణుడు
సృష్టికర్త-కీర్తనీయుడు నిత్యసంజీవుడు ||2||
కృతజ్ఞత స్తోత్రాలతో సుమధుర రాగాలతో ||2||
సంకీర్తన చేయుదము
ప్రణమిల్లి పూజింతుము ||2|| ||అరుణ||
2. అమరమైనది - అవధిలేనిది
మహిమ దేవుని ప్రేమ
విశ్వధాత్రీ - దైవజనమా
ప్రభుని కీర్తింపుము ||2||
తంత్రీవాద్యాలతో-మృదంగనాదాలతో ||2||
మన దేవుని పొగడెదము
పూజలు చేసెదము ||2|| ||అరుణ||