సా. అమలవిమల లోచన ఆది దేవా నమో నమా!
జయ విజయ కేతన ఏసు దేవా నమో నమో!
శాంతి దాత ప్రేమ ప్రదాత
పవిత్రాత్మ నమో నమో!
ప. క్రీస్తు జయంతి జేగంటల నాదం
ప్రేమ స్రవంతి సిరిపంటల రూపం
జేజే స్వాగతం జగద్రక్షకా!
మమతల స్వాగతం మరియ నందనా
1. నవ్య బాలుని గాంచి ఆనందించి
గొల్లలిచ్చిరి అతనికి ఘనమగు స్వాగతం
ఆ దివ్యరాజును ఆరాధించగ వచ్చి
రాజులిచ్చిరి రమ్యమైన స్వాగతం
సుస్వాగతం....
2. నడిరాత్రి చీకటిలో నరుడై వెలసిన
దేవా నీకిదే స్వాగతం! నవ్యస్వాగతం
గుడిగంటల నాదం తెలిపే నీ జన్మకేతనం
స్తుతి గీతాలతో నీకు స్వాగతం సుస్వాగతం