అమరలోకమునందు ( amaralokamunandhu Telugu Christian Song Lyrics | Christian Hymn Song Lyrics in Telugu)

అమరలోకమునందు ప్రభునకు
అతిశయమ్ముగ మహిమ యగుత
అవనియందున మానవజాతికి -
సర్వవేళల శాంతియుత
1. పరమ విభుడవు దేవ నీవు -
శక్తి పూర్ణుడవైన తండ్రి
భక్తితో నిను కొలుతు మెప్పుడు -
మీదు మహిమను పొగడు చుందుము
2. తండ్రి దక్షిణ పార్శ్వమందున -
కూర్చుండిన దివ్యసుతుడా
మేము చేసెడి విన్నపములను -
ఆదరంబున ఆలకింపుము
3. తండ్రి మహిమలో పావనాత్మతో -
నీవు మాత్రమే పావనుండవు
నీవు మాత్రమే ప్రభువు మాకు -
నీవు మాత్రమే సర్వోన్నతుడవు