అమూల్యమైన ( amulyamaina Telugu Christian Song Lyrics | Christian Hymn Song Lyrics in Telugu )

ప: అమూల్యమైన నీ రక్తము చేత
కరుణించి శుద్ధిచేయుమా ఏసయ్య
నన్ను కరుణించి శుద్ధిచేయుమా
మరణపు కోరల్లో చిక్కియున్న నన్ను ||2||
దయతో నీవే ఆదుకొనుము ప్రభువా ||2|| ||అ||
1. పాపపు ఊబిలో నే పడియున్నాను
జీవచ్చవమునై జీవిస్తున్నాను ||2||
నీ ముఖకాంతి నాపై కుమ్మరించి
నీ కృపలో నన్ను కరుణించుము దేవా||2|| ||అ||
2. శాపపు సంకెళ్ళతో బంధించబడితిని -
నీ కలువరి బలితో విడుదల చేయుమా ||2||
రోగపు ముల్లుకు గుచ్చబడి యున్నాను
జీవపు ఊటలు నాలో ప్రవహింపచేయు ||2||
నీ అమూల్యమైన నీ రక్తము చేత
వెలనిచ్చి కొనియుంటివి
యేసయ్య నన్ను వెలనిచ్చి కొనియుంటివి ||2||