అంధకార వేళలో ( andhakara velalo Telugu Christian Song Lyrics | Christian Hymn Song Lyrics in Telugu )

ప: అంధకార వేళలో హృదయాంతరాత్మను
ప్రభుని ప్రేమ కిరణములే
మధురముగా తాకింది ||2|| ||అ||
1. మధురాతి మధురమైన- ఆ ప్రేమ స్వరమే
సూర్యకిరణమోలె మంచు బిందు వోలే ||2||
తేట తెల్లనైనది నా ప్రభుని ప్రేమయే ||2|| ||అ||
2. పరమపిత ప్రేమ రూప
ప్రభు క్రీస్తు ప్రేమనాధా
మనసు నందు నింపినది
నా హృదిని తాకింది ||2||
పరవశించి పాడన
నా యేసు నామము ||2|| ||అ||