అంధకారపు ఈ జీవితం ( andhakarapu e jeevitham Telugu Christian Song Lyrics | Christian Hymn Song Lyrics in Telugu )

ప: అంధకారపు ఈ జీవితమును
వెలుగించుమయా నీ ప్రేమతో
దర్శింపుమయ్యా నా జీవితమును
కరుణించ రావా ప్రభు యేసునాధా ||అ||
1. కన్నీటితోను నిండిన బ్రతుకును
ఓదార్చుమయ్యా నీకరుణతో
క్షమించుమయ్యా.... నా దోషములన్ని
మన్నించ రావా ...నా యేసయ్యా ||2|| ||అ||
2. తిరిగొస్తినయ్యా నీ ..... ప్రేమతోను
దరిచేర్చుకోవా నీ.... దయతో
క్షమించుమయ్యా..... నాపాపములన్నీ
మన్నించ రావా.....నా యేసయ్యా ||2|| ||అ||