అపరాధములను మన్నించు దేవా ( aparadhamulanu maninchu Deva Telugu Christian Song Lyrics | Christian Hymn Song Lyrics in Telugu )

అపరాధములను మన్నించు దేవా
మా దోషములను మదినుంచకుమా
త్రోవను తప్పి తిరుగాడుచుంటిమి ||2||
నీ మార్గమందు నిలుపుము దేవా ||2||
1. నీతిని వెదకు జ్ఞానము నొసగి
కరుణతో మమ్ము కాపాడు స్వామి ||2||
కావగ రావా ప్రియమార మమ్ము ||2||
పాపుల రక్షక ప్రియమైన యేసువా ||2||
||అపరాద||
2. పాపపాశము తీసివేయుము
మృత్యు బంధము తెంచివేయుము ||2||
నీ దివ్య దర్శన భాగ్యమునొసగుము ||2||
పాపుల రక్షక ప్రియమైన యేసువా ||2||
||అపరాద||