Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
అబ్బా నాదు సర్వము-అర్పించెదనయ్యా
నా జీవిత కాలమంతా
నీకేనే సొంతమయ్యా
నీకై నా బ్రతుకుందయ్య ||2||
ఆరాధనా ||4|| ||అబ్బా నాదు||
1. ఆత్మదేహము అర్పించెదను
కపటం కల్మషము లేక కాపాడయ్య ||2||
ఒక రోజు భువిలో జీవించినను
అది ఉన్నత జీవితముగ ఉండాలయ్య ||2||
నాదని మరణింప కృప నీయుమయా ||2||
ఆరాధనా ||4|| ||అబ్బా నాదు||
2. మట్టిలోనే నే కలిసిఉన్నా
నీ వాక్కుతో నన్ను లేపుమయ్యా ||2||
మట్టి పాత్రగ నేనుండినను
నీ మహత్కర ఆత్మను నేమోయాలయ్యా ||2||
నీ మహిమను ప్రదర్శింప
కృపనీయుమయా
ఆరాధనా ||4|| ||అబ్బా నాదు||