Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
అమరాను రాగముతో ఆలించు స్వామీ! -
మా దీన పూజను మన్నించు స్వామీ !
1. నీ ప్రేమ సాగర ప్రవాహమందు -
నీ కరుణ తరగల తలమునకలై
అరమోడ్పు కన్నుల ఆనంద భాష్పాల -
ముకుళిత కరముల ముంగిట నిలువ
2. బంగరు కాంతిలో నీ మోము చూడ -
మమతల మాలలు నీ మెడలో వేయ
అనురాగ సుమముల దోసిట నింపి -
నీ పద సన్నిధి మేమంత నిలువ