Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
అమరుడేసు రాజుకు అంజలి అర్పించెదం
మనలను మనము ప్రభునకు సమర్పించుకొనుదము
1. పేద విధవరాలేసిన రెండు కాసులు -
యేసయ్య దృష్టిలో విలువైన రాసులు
తన సర్వం సమర్పించి తన సంపద యేసేనని
నేర్పుచున్నది సమర్పణా జీవితం
2. సృష్టిలోన ఉన్న అన్ని జీవరాసులు -
తమకోసం దాచుకోవు స్థిర చరాస్తులు
తమ సర్వం దేవుడని దేవునిపై భారమేసి -
నేర్పుచున్నవి సమర్పణ జీవితం