Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప అంబర వీధిలో ఆనందించెడి
ఆది ప్రభువుండ - అందుకో అర్పణా ||అ||
1. అప్పము నిచ్చుటయే
మనకు ఆశీర్వాదకరం
ద్రాక్షరసమును యిచ్చుటయే
మనకు రక్షణకరముగను ||అ||
2. పుచ్చుకొనుటకంటే
ఇచ్చుట ఎంతో ధన్యకరం
ఆదరంబును చూపుటకంటే
పుణ్యమైనది ఏదియులేదు ||అ||
3. వట్టిచేతులతోను
ప్రభుని చెంతన నిలువకుము
పట్టుదలతో ఉన్నదంతయు
ప్రభుకు నీవు అర్పణచేయు ||అ||