Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
సాకి : ప్రభువా... నీ ఆత్మతో .... నీ శక్తితో
నీవలె సేవింప అభిషేకించుము దేవా
మము అభిషేకించుము దేవా ఆ... ఆ... ఆ... ఆ...
ప: అభిషేకించుము దేవా నీ ఆత్మతో నీ శక్తితో
మము అభిషేకించుము దేవా నీ ఆత్మతో నీ శక్తితో
నీవలె సేవింప వరమీయుమా - నీ బాట నడచి నీవలె మారి
పరుల కొరకు జీవించ బలమీయుమా
పపదప పపదప పాదపగసరి
పపదప పపదప పదరిస
1. మెల్కిసెదేకుని యాజకునిగా ఎన్నుకున్నావు
దావీదుని రారాజుగా చేసిన దేవుడవు
సమూయేలు ప్రవక్తను నడిపించినావు
నీ వెన్నుకున్న ప్రియ బిడ్డలను అభిషేకించుమయా
2. శిష్యులపై పవిత్రాత్మను కుమ్మరించావు
జానజ్యోతిని వెలిగించి దారిచూపావు
కష్ట సమయాన తోడునీడగా నీవె నిలిచావు
నీ వాక్యము ప్రకటించగా అభిషేకించుమయా