Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
సా: సర్వసృష్టికర్త పిత సర్వేశ్వరా వందనం-
సర్వలోక రక్షక సుత సర్వేశ్వరా వందనం
సప్త వరప్రదాతా పవిత్రాత్మ సర్వేశ్వరా వందనం
త్రిత్వైక సర్వేశ్వరా వందనం వందనం వందనం - సరిగపనిస గరిసనిస
ప: అభిషేకించుము దేవా అభిషేకించుము నీ దాసుని నీ ఆత్మతో నీ శక్తితో
ఈ దివ్య బలిలో శ్రీక్రీస్తు బలిలో
స్వాగతం దేవా స్వాగతం-స్వాగతం దేవా సుస్వాగతం
గమపమగ... పనిసనిప... సనిపనిస-సనిరిస ... సనిరిస
1. మోషేను నాయకునిగా ఎన్నుకొంటివి-
దావీదును రారాజుగ నియమించితివి
నీ ప్రజలను కాపరిగ సేవించుటకు-
అభిషేకించుము దేవా నీ దాసుని ||స్వాగతం||
2. బాలుడైన ఇర్మియాను పిలిచియుంటివి-
మాట్లాడే ధైర్యమొసగి నడిపించితివి
నీ రక్షణ సువార్తను ప్రకటించుటకు-అభిషేకించుము దేవా నీ దాసుని ||స్వాగతం||