అబ్రహాము ఇస్సాకు
భూజనులందరికీ యాకోబునకు దేవుడవు
భూరాజులందరికి...
భూజనులందరికీ... పూజ్యుడవు
యేసయ్యా.. భూరాజులందరికీ
భూజనులందరికీ పూజ్యడవు ||అబ్రహా||
హల్లేలూయా....హల్లేలూయా....
హల్లేలూయా....ఆమెన్ ||2||
1. అబ్రహాము విశ్వాసులకు తండ్రియని
ఇస్సాకునకు ప్రతిగా గొరియ పిల్లనిచ్చి
యాకోబును ఇస్రాయేలని దీవించి
ఈ పాపిని నీవు విడువక ప్రేమించి
నా మంచి యేసయ్యా నీవున్న చాలయ్యా
నీ చేతి నీడలో జీవింతునయ్యా ||అబ్రహా||
హోసాన్నా...అల్లేలూయా...
2. జీవాహారమూ నేనేయని పలికితివి
జీవ జలముల ఓరగనను నాటితివి
నిర్జీవమైన నన్ను సజీవునిగ చేసి
హృదయం నుండి జీవజలములు పుట్టించి
నీ జీవాహారము నీ జీవజలమును
నాకిచ్చినందుకు స్తోత్రము చెల్లింతుము ||అబ్రహా||