అమరమైన నీ వాక్యం
అమరమైన నీ వాక్యం
పరవశించి పాడెదము
సాటిలేని నీదు వాక్యం
ఆలకించి చాటెదము ||2||
అల్లేలూయా..అల్లేలూయా..
అల్లేలూయా..అల్లేలూయా.. ||2||
1. తొలి ఉషస్సున మంచువలె
సస్యమిచ్చిన వాక్యం
ఫలమునిచ్చెడి జీవమై
ధాత్రియంతా పూచెను ||2||
విశ్వమానవ - ప్రగతి కోసం
యేసు ఇచ్చిన ప్రేమ సూత్రం ||2|| ||అల్లేలూయా||
2. దైవ రాజ్య భావనయే
నీవు ఇచ్చిన భాగ్యము
నీవు చూపిన బాటలో - భాగ్యము
అనుసరింతును నిత్యము ||2||
మహిమ నీకు కలుగురీతి
నీ సువార్తను చాటెదను ||2|| ||అల్లేలూయా|| ||అమరమైన||