Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
అదరకు బెదరకు శోధనలు నిను చుట్టినా
జడియకు బిడియపడకు యేసయ్య తోడుండగా
సాగిపోనీ మార్గము చేరుకో నీ గమ్యం
1 వ చరణం..
భయపడకుము నీ దేవుడున్నాడు
దిగులు పడకుము నిను బలపరచును
నీకు సహాయము చేయువాడు
ఆదుకొంటాడులే ` నిను ఆదుకొంటాడులే llసాగిll
2 వ చరణం..
నీవు నడిచే మార్గములోనా
నీ దేవుడున్నాడు నీకు అండగా
కలత చెందకు కన్నీరిడువకు
ఆదుకొంటాడులే నిను ఆదుకొంటాడులే llసాగిll ll అదరకుll