Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
అందరాని మందిరాన - అంటలేని మంటపమున
కొలువు దీరినా - కరుణదైవమా
కొంత దిగి - మా చెంత నుండుమాllఅందll
1 వ చరణం..
అరుణ కిరణము-సోకినంతనే
అమ్మ వచ్చియు-లేపినంతనే ||2||
మొదటిగా - నా పెదవి విప్పగా ||2||
వచ్చి యుంటిమి - నీదు ఇంటికి ||2||
2 వ చరణం..
కనుల విందుగు-నీ ముఖంబును
కలత జెందుచు-నీ పదాలను ||2||
కనుల కద్దుచు - మ్రొక్కు కుందును
కనికరించియు - కదలిరమ్మా ||2||
3 వ చరణం..
మనసు నంతను-మందిరంబుగ
మలచుకొంటిని-కొలువ నిన్నిట ||2||
చిన్న ఇల్లని-చీదరింపక ఉన్న
పదమున-నన్ను చేర్చుమా ||2||
4 వ చరణం..
పాపతాపము-పొంగి పొరలెను
పావనంబగు-పదములన్నిట ||2||
హృదయ శుద్ధిని - పదిల పరచగా
ముదముతో - నీ యెదగ మార్చుమా ||2|| llఅందll