Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
అంతరిక సౌఖ్యమొసగ -
నీవురావా దేవుని సుతుడా - మాపై కరుణ చూపుమా
1 వ చరణం..
అమ్మయొక్క ఉదరములో - నేనుండగా
అమ్మపొందిన కీడు నాలో - ఉన్నచో ...
వాటిని తొలగించి నాకు - ముక్తిని ఒసగు ...
మీ దివ్యస్పర్శతో - స్వస్ధత నొసగుllఅంతll
2 వ చరణం..
నేను పుట్టిన ఇంటిలో - పెరిగిన ప్రాయము...
అప్పుడు నాకు లభించని - ప్రేమ వాత్సల్యం ...
పూరిపాకలో జన్మించిన - బాలయేసువా ...
మీ ప్రేమవాత్సల్యం - ఒసగు మాకు ...llఅంతరికll
3 వ చరణం..
యవ్వన పొగరులో - నిర్లక్ష్యముగా...
కామ మోహవలయములో - మునిగినప్పుడు
ఆ పాప భావములు - రోగమైనచో
మీ దివ్యప్రేమతో - స్వస్ధత నొసగు...llఅంతరికll