Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
సా: అద్భుతాల అంతోనివారా
మా కొరకు ప్రార్ధించండి
ప: అద్భుతాల అంతోనివారా...
పాదువాపురి - పావనుడా... ||2||
ఆలకించుమా - విన్నవించుమా... ||2||
పరమేశ్వరుని - పదసన్నిధిలో..... ||2||
మా అవసరాలు-మా ఆవేదనలు..
మా ఆవేదనలు ||అద్భుతాల||
1. అచంచల విశ్వాసాన్నే - డాలుగా చేపట్టి
అటు ఇటు పదునైన వాక్కనే
ఖడ్గాన్ని దూసి ||2||
అలవోకగా - అశుద్దాత్మలన్ ||2||
పారద్రోలినా-అంతోనివారా ||అద్భుతాల||
2. ఆధ్యాత్మిక జీవనశిఖరాలన్నీ-అధిరోహించి
అధరాల అంచునే అద్భుతాలను సంధించి
అందరిని ఆ ప్రభు అనుగ్రహములో ||2||
ఆదరించిన... అంతోనివారా ||అద్భుతాల||
3. అద్భుతాలకే అద్భుతం...
అమోఘం నీ హస్తవాసి
ఆదిలోని వాక్కు అవనిలోన
మన మధ్య వెలసిన ||2||
ఆ దివ్య బాలునే నీ హస్తాలలో ||2||
ప్రసన్నం చేసిన... అంతోనివారా.... ||అద్భుతాల||