Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
llపల్లవిll
అంజలి యొసగుము రా
ఆ దేవుని మంచిని ఎంచుమురా
ll అ.ప. ll
కోరిన వారికి కల్పవృక్షము
ఆశ్రిత జీవుల కామధేనువనిll అంజలి ll
1 వ చరణం..
దిగంతములు మరి దృగంతములు
దేవుని మహిమను ప్రకటించుము రా ll అంజలి ll
2 వ చరణం..
వందనమనియెను దావీదు మరి
గంధము నొసగెన సాల్మోను
అంజలి ఉంచిన ఏసుప్రభుండు
హృదయాంజలి నొసగుము మదమతి తో ll అంజలి ll
3 వ చరణం..
అరిభీకరమౌ కరవాలం
ఆ పరమేశ్వర తిరునామం
నవనీతం కరుణారసం
నీ కరతాళములతో భజియించుమురా ll అంజలి ll