Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
అందరూ నమ్మాలిరా – యేసయ్యే దేవుడని
ఎలుగెత్తి చెప్పాలిరా – రాజులకు రాజని
గళమెత్తి పాడాలిరా – మహిమ, ఘనత నీకని
లోకాన చాటాలిరా –త్వరలో రానున్నాడని
యేసయ్య మాటలో విడుదలున్నది
యేసయ్య స్పర్శ లో స్వస్థతున్నది
యేసయ్య చూపులో క్షేమమున్నది
యేసయ్య ప్రేమలో ఆదరణ ఉన్నది ll అందరూ ll
1. మాట మాత్రం సెలవియ్యగా –
సమాధిలోని లాజరు బయటికొచ్చెను
చిన్నదాన లెమ్మనగా యాయీరు కూతురు తిరిగి లేచెను ll యేసయ్య ll
2. చల్లనైన చేతి స్పర్శ తో గుడ్డివాడు చూపునొందెను
మాట అన్న తక్షణమే పక్షవాతము వదలిపోయెను ll యేసయ్య ll
3. శక్తి గల ఆ చూపుతో సేన దయ్యములు వదిలి పోయెను
బెత్సెయిద కోనేరు దగ్గర ప్రేమతో రోగిని స్వస్థ పరచెను ll యేసయ్య ll