Type Here to Get Search Results !

అద్భుతశక్తితో ( adhbhuthashakthitho Song Lyrics in Telugu | Telugu Christian song lyrics website )

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. అద్భుతశక్తితో అలరారిన భక్తుడు ||2|| 

అందరి మన్ననలు 

పొందిన ఆచార్యుడా ||2|| 

అందుకో మా ప్రణతులను

అంతోని మహా పునీతుడా ||2|| 


1. ప్రేమ అనెడి పుణ్యములో 

నిలకడగా నిలిచితివి 

ప్రియబాల యేసుని ఎత్తి 

ముద్దులాడితివి ||2|| 

పెద్దల మాటలనెపుడు 

జవదాటని దాసుడివి ||2|| 

సత్యవార్త సేవలో 

సాక్షిగ వెలుగొందితివి ||అ|| 


2. పాపుల పరివర్తనకై ప్రార్ధనలు సలిపితివి

ఆశ్రమ వాసులకు ఆదర్శుడవైయుంటివి 

పోయిన వస్తువులకు పాలకుడై 

వెలసితివి అందరి భక్తులకు

ఆశాజ్యోతివై యుంటివి ||అ|| 


3. దివ్య సత్ప్రసాదమందు నమ్మిక

నీకెంతో మెండై 

దివ్య వరములెంతో 

నీకు దీవెనలై నిలుచుండె ||2|| 

దివ్యమైన రాజ్యములో ప్రభు సన్నిధి నీకుండే 

దివ్యమైన మోక్షపురిలో ప్రార్థించుము 

మాకు తోడై ||అ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section