Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. అది ఎంత సత్యమైన ప్రేమ నిత్య ప్రేమ
అది కొలువగ లేని ప్రేమ
దైవ ప్రేమ నిత్య ప్రేమ
ఏ పరిస్థితిలోను ఏ షరతులు లేక
ప్రేమించు నన్ను వందనం ప్రభునకు
1. దేవుని నే మరచినను
ఆ ప్రేమను నే మరచినను ||2||
కనికరించు ఆ హృదయ మెప్పుడు
నాకై పరితపించు
ఎంతగానో నన్ను ప్రేమించు ||అ||
2. తల్లియే నన్ను మరచినను
ఈలోకమే ద్వేషించినను
మంచి కాపరి నన్ను వెదకును
నాకై పరితపించు ఎంతగానో
నన్ను ప్రేమించు ||అ||