Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
అయ్యా రావయ్యా మెస్సయ్యా
ఎన్నాళ్ళు ఈ కళ్ళు ఎదురు చూసెనయ్యా
మా గోల నీకేల వినిపించదయ్యా అయ్యా
1 వ చరణం.. చీకటి నిండిన ఈ హృదయాలలో
వేకువ తొంగి చూసే దేనాడు
ఆకలి బాధలు గల ఈలోకములో
నీకై తపియించె దెన్నాళ్ళు అయ్యా
2 వ చరణం.. యూదా జాతి బానిస బ్రతుకులో
వేదన చల్లార్చే వారెవరు
రోమా రక్కసి పరిపాలనలో
ధర్మము నిలుపగ వచ్చెదెపుడు అయ్యా