Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
అదిగో ఆకసాన వెలసిన తార
ఇదిగో బెత్లెహేము చేరిచూడ
చిత్తశుద్ధితో శిశువుకు పాడ
కాచును ప్రజలను కరుణతోడ
గ్లోరియా గ్లోరియా గ్లోరియా ఇనెక్సెల్సిస్ దేయో
1. దేవుని ప్రేమకు ప్రతిరూపం
దివ్య రక్షణకు వరదీపం
విశ్వశాంతికీ మూలాధారం
సర్వసృష్టికీ జీవాధారం
గ్లోరియా గ్లోరియా
2. పేదలైన గొల్లలు కూడిరి
బాలుని చూచి ధన్యులైరి
మువ్వురు జ్ఞానులు ఆరాధించిరి
ఘనమగు కానుకలర్పించిరి ||2|| ||అదిగో||