Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. అదిగో ఆవంక...
ఆ చిలుకా గోరువంక ||2||
మనసులు ఒకటైనాకింక
వారికి చింతలు లేవింక ||2||
1. కళకళలాడే మోములు
కలలే నిండే కన్నులు
ఎత్తిరి వనితలు హారతులు
తలవంచిరి నూతన దంపతులు ||2||
2. ముచ్చట మూడు ముళ్ళు
అవి ఎదలకు వేసే సంకెళ్ళు
దీవించిరి పేరంటాళ్ళు
వర్థిల్లమని వంద ఏళ్ళు ||2||