Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: ముమ్మారు
ప. అల్లేలూయ(ముమ్మారు)
జనంబులారాసంతసం
మనంబు నుంచి పాడరే
ఘనుండు యేసులేచెనే ||అ||
2. అల్లేలూయ - మరియ మగ్దలేనయున్
పురంబులోని కాంతలున్
త్వరన్ సమాధికేగిరి ||అ||
3. అల్లేలూయ - సుగంధమైన తైలము
తగంగ పూయమేనికి జగన్
ప్రభాత మేగిరి ||అ||
4. అల్లేలూయా - అపోస్తులైన రాయప్ప
కృపారుడైన అర్లప్ప
అపారకాంక్ష నేగిరి ||అ||
5. అల్లెలూయా - సమాధి నుంచి యేసువు
క్రమాన లేచెనంచున్
భ్రమంబు దూతలార్పిరి ||అ||
6. అల్లేలూయా - అపొస్తులెల్ల రొక్కటై
జపించు వేళ యేసుపు
యపేక్ష తోడ చేరిరి ||అ||
7. అల్లేలూయా - బిరానవారు జూడగా
పరాత్పరుండు కూర్మితో
మరిన్ శుభంబు మీకనెన్ ||అ||
8. అల్లేలూయా-ఉత్థానమైన యేసువున్
సంతోష గీత పాటలతో
స్తుతించరండు అందరు ||అ||