అద్భుతమైనది నీ వాక్కు అమరమైనది నీ వాణి - ||2||
ఆనంద భరితులను చేసేది అపారమైన ప్రేమ సందేశం
ఆలకించి అచ్చెరువు పొందండి అమర లోకాన్ని చేరండి - ||2||
ఆకాంక్షతో పులకించి బాటలు వేయండి - ||2||
1. యుగాలు దొర్లాయి నీ వాక్యంలో - కాలాలు మారాయి నీ ప్రేమ సందేశంతో - ||2||
అద్భుతమైన నీ శైలి బహిర్గతమయ్యే నీ వాక్కులో - ||2||
ఆ వాక్కే ఈనాడు మాకు శిరోధార్యం - ||2||
2. నీ వాక్కే ప్రవక్తలందరి సందేశం - రాజుల పాలనకు మూలం అదే మూల్యం - ||2||
కడరోజుల్లో కుమారుడే ఈ వాక్కుగా - ||2||
ఆ వాక్కే ఈనాడు ఆవిర్భవించే మన హృదిలో - ||2||