Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: యేసే నా గానం - 2
ప. అల్లెలూయ అల్లెలూయ
దేవా నీ మాట లాలించి పాటించుట
ఎంతోమేలు -రాయి లాంటి ఆత్మలకు
అల్లెలూయ అల్లెలూయ అల్లెలూయ ||2||
1. నీ పలుకే కదా భూమిని అకాశమును కలిగించెను
నీ పలుకే కదా సూర్యచంద్ర నక్షత్రాలను చేసెను
నీ పలుకే కదా సాగర పర్వతాలను పుట్టించెను
నీ పలుకే కదా ఈ సృష్టిని అందాలతో ఆలకించెను
అల్లెలూయ - అల్లెలూయ అల్లెలూయ||2||
2. నీ పలుకే కదా మూగ చెవిటివారికి మాట వినికిడిచ్చెను
నీ పలుకే కదా-గ్రుడ్డి, కుంటి వారికి చూపు, నడకిచ్చెను
నీ పలుకే కదా మరణించిన వారిని జీవంతో లేపెను
నీ పలుకే కదా భూలోక మంతటిని నడిపించెను ||దే||