Lyrics: Fr. Gnanam SDB
Tune: Fr. Gnanam SDB
Music: Naveen M
Album: ప్రణతులు - 2
ప. అల్లెలూయ - అల్లెలూయ
అల్లెలూయ - అల్లెలూయ
ప్రేమను పంచిన ఓ ప్రభువా వినిపించయ్యా నీ వాక్యం
నీ వాక్యములో నా బ్రతుకు చిగురించాలి అను నిత్యం ||అల్లే||
1. భారము నిండిన మనస్సులకు
సేదను తీర్చును నీ వాక్యం ||2||
వేదన మిగిలిన నా హృదికి ||2||
ఊరట నిచ్చును నీ వాక్యం ||2|| ||అల్లే||
2. స్వార్థం కోరిన యోచనకు
మార్పును నేర్పును నీవాక్యం ||2||
వేకువ నెరుగని నా గతికి ||2||
వెలుగును పంచును నీ వాక్యం ||2|| ||అల్లే||