Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
అల్లేలూయ - అల్లేలూయ ||2||
ప్రభుయేసు వాక్యము - విలువైనది మనుజాళి ముక్తికి - బలమైనదీ ||2||
నమ్మిన నరులంతా – ధన్యులు సరిక్రొత్త జీవితం - పొందేరువారు ||2||
1 వ చరణం..
ఇలపొరుగు వారిని - ప్రేమించమని ||2||
పొరపాటు చేసినచో - మన్నించమని ||2||
ప్రభు యేసు చెప్పిన - ఈ మాటను ||2||
పాటించిన వారంతా - ఇల ధన్యు ||2||
2 వ చరణం..
పరివర్తనము చెంది - పాపమును వీడి ||2||
మలిన రహితమై - జీవించమని ||2||
ప్రభు యేసు చెప్పిన - ఈ మాటలను
అనుసరించిన వారంతా - ఇలధన్యులు ||2||
అల్లేలూయ - అల్లేలూయ అర్పణ గీతములు