Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
అల్లేలూయా అల్లేలూయా
అల్లేలూయని పాడరే మన ప్రభుని స్తుతించరే
1 వ చరణం..
ఆడెదం పాడెదం సంగీత నాట్యాలతో
చాటెదం ప్రభు మహిమను
ధరను జనులకు ప్రేమతో అల్లేలూయా 2
ఘనప్రభువు తన మహిమచే
మరణమును గెలిచినేడు
ఉత్థానమాయెను భువినుండి
దివికి దివ్యతేజముతో హల్లేలూయా
2 వ చరణం..
జీవమునిచ్చిమార్గమును చూపి
సత్యమును నేర్పిన
ప్రభుయేసుని ఆ సిలువలో
యూద ముష్కరులు చంపగా
ఘన ప్రభువు తన మహిమచే
మరణమును గెలిచే నేడు
ఉత్థానమాయెను భువినుండి
దివికి దివ్యతేజముతో అల్లేలూయా
3 వ చరణం..
దూతలు అంబరమున సంతసముతో పాడగా
సైతానుడు ప్రభు మహిమను గాంచి
పరుగులు తీయగా
ఇల జనములు సంతసమున
అల్లేలూయనుచు పాడగా
భువియంతట ప్రభు జనులకు
సంతోష ముప్పొంగగా
ఘన ప్రభువు