Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
1 వ చరణం..
అల్లెలూయా (ముమ్మారు) జనంబులారా సంతసం
మనంబు నుంచి పాడరే ఘనుండు యేసులేచెనే ll అల్లెలూయా ll
2 వ చరణం..
అల్లెలూయా మరియ మగ్దలేనయున్ పురంబులోని
కాంతులున్ త్వరన్ సమాధి కేగిరి ll అల్లెలూయా ll
3 వ చరణం..
అల్లెలూయా సుగంధమైన తైలము తగంగ
పూయమేనికి జగిన్ ప్రభాత మేగిరి ll అల్లెలూయా ll
4 వ చరణం..
అల్లెలూయా అపోస్తులైన రాయప్ప
కృపార్హుడైన అర్లప్ప అపారకాంక్ష నేగిరి ll అల్లెలూయా ll
5వ చరణం..
అల్లెలూయా సమాధి నుంచి యేసువు క్రమాన
లేచెనంచున్ భ్రమంబు దూతలార్పిరి ll అల్లెలూయా ll
6వ చరణం..
అల్లెలూయా అపోస్తులెల్ల రొక్కటై జపించువేళ
యేసువు యపేక్షతోడ చేరిరి ll అల్లెలూయా ll
7వ చరణం..
అల్లెలూయా బిరానవారు జూడగా పరాత్పరుండు
కూర్మితో మరిన్ శుభంబు మీకనెన్ ll అల్లెలూయా ll
8వ చరణం..
అల్లెలూయా ఉత్థానమైన యేసున్ సంతోష
గీత పాటలతో స్తుతించరండు అందరు ll అల్లెలూయా ll