Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
అల్లి పల్లి మరియతల్లి
ఉల్ల మెల్ల పొరలి పొంగి
కొండపై నిన్ను జూచి- వంగి నీకు మ్రొక్కుచుంటి
1.
వాడ వాడ తిరిగినాము
నీదు జాడ తెలిపినాము
చిన్న పెద్ద చిలిపే మందా
వచ్చి నిలిచి నీదు చెంత ll అల్లి ll
2.
నిన్గిలోని చందమామ
నిన్ను చూచి కందిపోయె
నీదు రూపు పావనంబు ll అల్లి ll
3.
చేతులెత్తి జేలు కొట్టె
జనుల మీద జాలి చూపి
కన్ను మూసి తెరచెనంత
కాన్కలిచ్చి సాగనంపు ll అల్లి ll
4.
ఘనము ఘనము మరియ కడంచు
మేము నిన్ను కొలుచు చుండ
గగన తార పరమంతా
కదలి రాగ స్వర్గ మార్గ మాయె
మా హృదికి సర్వమాయె ll అల్లి ll