Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
అరుణ కిరణ మరియ జగతి నేలు మాత
జీవితాన మాలో నిలచి శాంతి నోసగుమమ్మా
బ్రతుకు భారాన్ని భరియించిన తల్లీ
ప్రేమతో వేడెద దీవించుమాతా
1. ప్రభుని ప్రేమ మరచి పుణ్య పధము విడిచి
అంధకార క్రియలతో పతన మొందినాడు
నరుల పాపాలన్నీ ఎరిగివున్న తల్లీ
ప్రేమతో వేడెద ప్రార్దించు మాతా
2. నీవే తోడు మాకు మోక్షమార్గమందు
నిత్యము నేర్పుము నీదు సుతుని ప్రేమ
జనుల శోకాలన్ని ఎరిగివున్నా తల్లీ
ప్రేమతో వేడెద కరుణ జూపుమమ్మా !