Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప: అల్లిపల్లి మరియ తల్లి
అందరికి కన్న తల్లి
అధములను ఆదరించు
అమ్మయైన అమలోద్భవి ||అ||
1. కానుక మాతగా నిన్ను
కన్నులారా గాంతుమమ్ము
కన్నసుతుని అర్పించిన
కన్యక యగు మరియాంబ
వ్యాకుల మాతగ నిన్ను
ప్రవచించెను సిమియోనుడు
ఖ్యాతిగాంచు అల్లిపల్లి
కొండ శిఖరమందు నీవు ||అ||
2. అన్నమ్మను భక్తురాలు
ధన్యతోందే నిన్ను జూచి
అందరి భక్తుల మనువుల
అందుకొనుము దయచూపి
అంతులేని కృప జూపుచు
ఆదరముతో ఆలకించు
అన్నమ్మ సిమియోను
దారియందు మము నడుపుము ||అ||
3. అల్లిపల్లి ప్రాంతమంత
అనుగ్రహముతో నింపెతల్లి
అడుగు వారికెల్లప్పుడు
అండ దండ నీవెతల్లి ||2||
అందుకొనుడి అమ్మవరము
అనుదినము ప్రార్ధించుచు ||2||
ఆనందము పొందరండి
అమ్మ చెంత నిలుచుండి ||అ||
4. మెట్ట ప్రాంత జనలెల్లరు
మెచ్చదగిన మహాతల్లి
మేలులెన్నో చేయు తల్లి
మేఘరంగు వస్త్ర ధారీ ||అ||
మొదలు పెట్టుమానవులకు
ముదము గూర్చు మధురతల్లి
మోక్షదారి జూపే తల్లి
మోక్షపురిలో నిలుపు తల్లి ||అ||